శంషాబాద్, ప్రభన్యూస్: గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దుబాయ్ నుండి (ఈకె-526) ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికులను విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చి ఇద్దరు ప్రయాణికులను తనిఖీలు చేసి స్కానింగ్ చేయగా బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని జీన్స్ ప్యాంట్‌లోపలి జేబులలో పెట్టుకొని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బంగారం 1 కోటి 87 లక్షలు విలువ జేసే 3 కిలోల 591 గ్రాములు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.