Sunday, November 17, 2024

తెలంగాణాలో ఎండ‌ల‌కు జ‌నం హ‌డ‌ల్…

హైదరాబాద్‌, : రాష్ట్రంలో ఎండలు అదరగొడు తున్నాయి. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతు న్నారు. రాష్ట్రంలో ఉత్తర దిశ నుండి అతి తక్కువ ఎత్తులో వేడిగాలులు వీస్తున్నాయ ని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల కు ఆస్కారం ఉందని హైదరాబాద్‌ వాతావ రణశాఖ సంచాలకులు నాగరత్న బుధవా రం తెలిపారు. మధ్యస్థ భారతదేశంతో పాటు రాజస్థాన్‌ నుండి వేడిగాలులు వీస్తుం డడం వల్ల తేమశాతం తగ్గి మూడు, నాలు గు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రం లోని 23 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు బుధవారం 40 డిగ్రీల సెల్సియస్‌ దాటి నమోదుకావ డం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. రెండు, మూడు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో 44డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదుకా వొచ్చని హైదరా బాద్‌ వాతావరణశాఖ ప్రకటించింది. ఉద యం 10గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు బయ టకు రావొద్దని, వడగాలులు వీచే అవకాశముందని.. ఎండ తీవ్రతకు ఆరోగ్యసమస్యలు తలెత్తే అవకాశముందని వాతా వరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యధికంగా కుమురం భీం జిల్లాలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి ఆరం భంలో నే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. మహబూబాబాద్‌, భూపా లపల్లి జిల్లాల్లో అత్య ధికంగా 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. వరంగల్‌ అర్బన్‌, గ్రామీణ, జనగామ, ములుగు జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. మంచిర్యా ల, జగిత్యాల, సూర్యా పేట, ఖమ్మం, నల్లగొండ, తదితర జిల్లాల్లో కూడా ఎం డలు దంచికొట్టాయి. ఉదయం 10 గంటల నుంచే గ్రీష్మతాపం మొదలవుతుండగా, ఎండవేడిమికి బయటకు రావడానికి ప్రజ లు జంకుతున్నారు. ద్విచక్ర వాహన దారులు ఎండవేడిమితో పలు ఇక్కట్లు పడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
ప్రాంతం ఉష్ణోగ్రత
ఆసిఫాబాద్‌ 42.8
మహబూబాబాద్‌ 42
భూపాలపల్లి 42
వరంగల్‌ 41
ములుగు 41
నల్లగొండ 41
సూర్యాపేట 41
ఖమ్మం 40
హైదరాబాద్‌ 39

Advertisement

తాజా వార్తలు

Advertisement