హైదరాబాద్ : భారతదేశంలో వైద్యుల కోసం అతిపెద్ద ఈఎంఆర్ ప్లాట్‌ఫారమ్ అయిన హెల్త్‌ప్లిక్స్, వైద్యుల ప్రాక్టీస్ సులభతరం చేయడానికి తమ ఆఫ్‌లైన్ ఈఎంఆర్ ని ప్రారంభించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం హెల్త్‌ప్లిక్స్ 300 కంటే ఎక్కువ నగరాల్లో 12,000కు పైగా వైద్యులకు సేవలు అందిస్తోంది. ఈ ఆవిష్కరణతో, హెల్త్‌ప్లిక్స్ ఈఎంఆర్ వైద్యులకు 24 ఇన్ టు7 అందుబాటులో ఉంటుంది. హెల్త్‌ప్లిక్స్ ఈఎంఆర్ ఈ వెర్షన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సామర్థ్యాల చక్కతనాన్ని అందిస్తుంది.
ఈ సందర్భంగా హెల్త్‌ప్లిక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చైతన్య రాజు మాట్లాడుతూ… హెల్త్‌ప్లిక్స్ ఆఫ్‌లైన్ ఈఎంఆర్ వైద్యులు అడపాదడపా ఇంటర్నెట్‌తో కూడా ప్రాక్టీస్ చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఇది వైద్యులకు గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందన్నారు. హెల్త్‌ప్లిక్స్ ఈఎంఆర్ ని స్వీకరించే వైద్యులకు ఎదురయ్యే అవరోధాలను తొలగించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. దీనికి అనుగుణంగా తమ ఉత్పత్తి, ఇంజనీరింగ్ బృందాన్నిరెట్టింపు చేసామన్నారు. తదుపరి 6-12 నెలల్లో, వైద్యులకు వారి అభ్యాసాన్ని మెరుగు పరచడంలో సహాయపడే వినూత్న ఉత్పత్తులను తాము విడుదల చేస్తూనే ఉంటామన్నారు.