కమ్యూనిటీలకు మద్దతును విస్తరించడంలో భాగంగా గస్ ఎడ్యుకేషన్ ఇండియా (జీఈఐ) ఇప్పుడు సొసైటీ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎకనమికల్ ప్రోగ్రెస్ (షీప్)కు పౌష్టికాహారం, పరిశుభ్రతావసరాలను 4 నుంచి20 సంవత్సరాల లోపు బాలికలు, మహిళలు అందించడం ద్వారా సహాయపడింది. దీనిలో భాగంగా 180కేజీలు,లీటర్ నిత్యావసరాలు (గోధుమలు, బియ్యం, ఉప్పు, పంచదార, మసాలాలు, నూనె, పప్పులు మొదలైనవి), 60కి పైగా క్లీనింగ్ మెటీరియల్స్ (చీపుర్లు, గార్బేజ్ బిన్స్, మాప్స్, బకెట్స్, మగ్స్ మొదలైనవి), 50కు పైగా సాధారణ పరిశుభ్రతావసరాలు (సబ్బులు, క్లీనర్స్,శానిటరీ ప్యాడ్స్ మొదలైనవి), మాస్కులు, గ్రోసరీలు, దుస్తులు, స్టేషనరీ మొదలైనవి సేకరించారు. ఈసందర్భంగా గస్ ఎడ్యుకేషన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి జలిగామా మాట్లాడుతూ… షీప్తో తాము తమ సేవా కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ఇదే తరహా సహాయాన్ని వీలైనంతగా కమ్యూనిటీలకు అందించడానికి ప్రణాళిక చేస్తున్నామన్నారు. లింగ వైవిధ్య కార్యక్రమాల పట్ల తమ దృష్టికి అనుగుణంగా ఉండటం చేత షీప్ను తాము ఎంచుకున్నామన్నారు. ఓ సంస్థగా తాము తమ ఉద్యోగుల్లో 40శాతం మహిళలకు స్థానం కల్పించామన్నారు. మహిళలు, బాలికలకు మద్దతునందించేందుకు వారి ఉద్యోగులు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ తరహా మరిన్ని భాగస్వామ్యాలు వైవిధ్యతను తీసుకురానున్నాయని షీప్ ఎన్జీవో ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జి.నిర్మల అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital