Saturday, September 14, 2024

HYD: గన్ మిస్ ఫైర్.. మహిళకు తీవ్రగాయాలు

గ‌న్ మిస్ ఫైర్ కావ‌డంతో మ‌హిళ‌కు తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న‌ హైదరాబాద్ నగర పరిధిలో చోటుచేసుకుంది. నార్సింగిలోని గంధంగూడలో ఆర్మీ రేంజ్‌లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా తుఫాకీ ఒక్కసారిగా మిస్ ఫైర్ అయింది. ఈ క్రమంలో బుల్లెట్ సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోంచి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో మహిళ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement