Friday, November 22, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన గ్రాండ్ మాస్ట‌ర్ జ‌యంత్ రెడ్డి, కరాటే రాజు నాయ‌క్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వెంగల్ రావు పార్క్ లో అంతర్జాతీయ టైక్వాండో కరాటే క్రీడాకారులు, 29 సార్లు గిన్నిస్ రికార్డ్ సాధించిన గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డీ, టీఆర్ఎస్ నాయకులు గిన్నిస్ రికార్డ్ హోల్డర్ టైక్వాండో కరాటే వరల్డ్ ఛాంపియన్ డాక్టర్ కరాటే రాజు నాయక్ లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో అవసరమన్నారు.

ఇందులో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. అలాగే మరో ఐదు లక్షల మొక్కలు మార్షల్ ఆర్ట్స్ కరాటే కుంగ్ ఫు టైక్వాండో క్రీడాకారుల తరుపున నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింద‌న్నారు. మన చుట్టూ ఎల్లప్పుడూ గ్రీనరి ఉండేట్లు చూసుకోవాల‌ని, అది మనకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ టైక్వాండో గోల్డ్ మెడలిస్ట్ అబ్దుల్ ఖలీల్, మార్చిలో యూకే అమెరికాలో జరిగే అంతర్జాతీయ టైక్వాండో పోటీల్లో పాల్గొన్న‌ ఇండియా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement