హైదరాబాద్ : కరోన కట్టడి కోసం తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, లాక్ డౌన్ విషయంలో హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్ లాక్‌డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. పూర్తి స్థాయి లాక్‌డౌన్ అవసరమైనప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. లాక్‌డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నారు. ఢిల్లీలో లాక్‌డౌన్ కారణంగానే రాష్ర్టానికి టెస్టింగ్ కిట్లు రావడం లేదని పేర్కొన్నారు. లాక్‌డౌన్ కంటే మంచి చికిత్సను అందించడం ముఖ్యమని ఆయన చెప్పారు. పూర్తి లాక్‌డౌన్ వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని, ఆ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. .