హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధనలో వ్యవసాయ రంగం పాత్ర కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం శనివారం నాడు వర్చువల్ విధానంలో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేశ్ చంద్‌తో కలిసి గవర్నర్ తమిళి సై విద్యార్థులకు, పరిశోధకులకు పట్టాలు ప్రదానం చేసి మాట్లాడారు. వ్యవసాయం, పాడిపశువులతో ఆదాయం పెరుగుతుందని అన్నారు. వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వ్యవసాయరంగంలో కొత్త ఆవిష్కరణలు అవసరం – గవర్నర్
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement