Tuesday, November 26, 2024

కరీంనగర్, జగిత్యాలలో లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు భూమిని మంజూరు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ : తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నూనెల సంస్థ లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 82,000 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ మంజూరు చేసింది. ఈసంద‌ర్భంగా లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మహావీర్ లోహియా మాట్లాడుతూ… ముడి పామాయిల్ దిగుమతిపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించి, దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల అవసరాలను తీర్చే ఈ కార్యక్రమం పట్ల తాము ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు.

పరిశ్రమలో త‌మ నైపుణ్యం, ప్రపంచ స్థాయి ప్రమాణాలు గత కొన్ని దశాబ్దాలుగా గుర్తించబడ్డాయన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా తాము ఎంపిక కావటాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఉత్తమ నాణ్యత కోసం ఐదుసార్లు సీఐటీడీ జాతీయ అవార్డు గెలుచుకుందన్నారు. ఫోర్బ్స్‌లో గమనించదగిన 5 అన్ లిస్టెడ్ ఎంటర్‌ప్రైజెస్ గా జాబితీకరించబడింద‌న్నారు. ఇది భారత సైన్యం కోసం ఆమోదించబడిన విక్రేత అన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ, హలాల్, హెచ్ఏసీసీపీ ధృవీకరించాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement