Friday, November 22, 2024

వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి తలసాని

వ‌ర‌ద ముంపు స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చేయ‌డ‌మే ప్ర‌భుత్వ లక్ష్య‌మ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల పరిధిలో ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులు చేపట్టిన నాలాలను మంత్రి త‌ల‌సాని ప‌రిశీలించారు. మంత్రి వెంట‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, అధికారులు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ… వరద ముంపున‌కు ప్రధాన అడ్డంకిగా ఉన్న నాలాల పై అక్రమ నిర్మాణాలు అన్ని తొలగిస్తామ‌న్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో నాలాకు ఎగువ నుండి వచ్చే వరదతో ముంపున‌కు గురవుతున్న నాలా పరిసర కాలనీలు, బస్తీలు, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వరదలు వచ్చిన సమయాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. ఎన్ని కోట్ల నిధులైనా ఖర్చు చేస్తామ‌ని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమ‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement