ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటలవరకు బస్తీదవాఖానాలుపనిచేస్తాయని తెలిపారు వైద్య..ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. దవాఖానాల్లో మందుల కోసం నెలకు 20వేల రూపాయలను కేటాయించామనారు. అన్నిదవాఖానాలను తెలంగాణ డయాగ్నాస్టిక్ సెంటర్‌తో అనుసంధానంచేశామని చెప్పారు. బస్తీదవాఖాలకు వచ్చిన పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో ఇవి విజయవంతం కావడంతో మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నామని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పెద్ద నగరాల్లో బస్తీ దవాఖానాలను విస్తరిస్తామని వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్‌నగరంలో పెద్దసంఖ్యలో బస్తీదవాఖానాలను ఏర్పాటుచేశామన్నారు. నగరంలో 225 బస్తీదవాఖానాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని ఏర్పాటుచేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని అన్ని పెద్ద నగరాల్లో బస్తీదవాఖానాలను విస్తరించే ప్రతిపాదన ఉందన్నారు. బస్తీదవాఖానాల్లో ఒక డాక్టర్, స్టాఫ్‌నర్స్ తోపాటు అటెండర్‌ఉంటారని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement