తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆన్నారు. హైదరాబాద్ లోని బొగ్గుల కుంట, తిలక్ రోడ్, లోని తెలంగాణ సరస్వత పరిషత్ ఆడిటోరియంలో రవి శ్రీ ఆధ్వర్యంలో జరిగిన ప్రీమియర్ అవార్డ్స్ 2022-2023 ప్రదానోత్సవం కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రీమియర్ అవార్డులను అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడున్నర సంవత్సరాలుగా సంక్షేమంలో దేశంలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. ఆడ బిడ్డలను గౌరవించే సంస్కృతి మన తెలంగాణదన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్, కార్యక్రమాన్ని, ఆడబిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మీ పథకం ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే లక్ష్మీ పుట్టిందనుకుంటున్నారు. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామన్నారు. ఇలాంటి సందేశాత్మక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమాజ సేవకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస్, టెలివిజన్ రవి శ్రీ బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.