డాక్టర్.బీఆర్ అంబేద్కర్ కీర్తి ప్రతిష్టలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఎక్కడాలేని విధంగా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానని నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. జూబ్లీహిల్స్ వార్డులో చింతల్ బస్తి ప్రేమ్ నగర్ లో రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా మేయర్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ఆ మహనీయుడు దేశానికి చేసిన కృషి, సాధించిన విజయాలు ఎంతో ఉత్తమమైనవన్నారు. భావితరాలు ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు అంబేద్కర్ విగ్రహాల కెల్లా హైదరాబాదులో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడంతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడిచిందని మేయర్ తెలిపారు. సంఘ సంస్కర్తగా, రాజకీయ వేత్తగా, మొదటి దేశ ఆర్థిక మంత్రిగా సేవలందించిన ఆయన దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని మేయర్ అన్నారు.