Saturday, November 23, 2024

హైదరాబాద్ లో గౌరి సిగ్నేచర్ యునిక్ కలెక్షన్స్

హైదరాబాద్ లో అతిపెద్ద గౌరి సిగ్నేచర్ షోరూం ప్రారంభోత్సవం సోమవారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కాంచీపురం గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ ను శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామిజీ (చిన్న జీయర్ స్వామిజీ శిశ్యుడు) తన దివ్యమైన హస్తాలతో శుభప్రదంగా ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవిత్రమైన పెళ్ళి పట్టు చీరలకు, భారతదేశంలోనే అన్ని కార్ఫ్ట్ రకాల పట్టుశారీలు ఓకే ఒక వేదిక గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ అని పేర్కొన్నారు. గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ హైదరాబాద్ లోని రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్ లో ప్రారంభించారు. షోరూం ప్రతినిధులు ఉదయ్ సాయి, హరిరాజు మాట్లాడుతూ… గౌరి సిగ్నేచర్ లో యునిక్ కలెక్షన్స్ స్వచ్ఛమైన ఒరిజినల్ పట్టు వస్త్రాలను అందరికీ అందుబాటు ధరలకే అందిస్తున్నామని తెలిపారు. అంతే కాదు ప్లాస్టిక్ ఎక్కడా వాడకుండా వచ్చిన ప్రతి కస్టమర్ కి క్లాత్ బ్యాగ్స్ లో, పేపర్, ఉడ్ వాటితో అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement