శేరిలింగంపల్లి, (ప్రభ న్యూస్) : నగరంలోని జిహాన్ స్పోర్ట్స్ ఆధర్యంలో జరిగిన జిల్లా స్థాయి సిమ్మింగ్ పోటీల్లో గచ్చిబౌలి జీఎంసి బాలయోగి స్టేడియంలో శిక్షణ పొందుతున్న చిన్నారులు తమ ప్రతిభను చాటి మెడల్స్ స్వాధీనం చేసుకున్నారు. అండర్ 14 విభాగం పోటీలలో తమ సత్తా చాటుకోవడంతో పాటు 28,29, తేదీలలో సిద్దిపేటలో జరిగిన జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు స్విమ్మింగ్ కోచ్ తిరుపతయ్య తెలిపారు. 200 మీటర్లు బటర్ ఫ్లై పోటీలతో పాటు 800 మీటర్ల ఫ్రీస్టైల్ జోహాన్ బ్రౌన్జ్ పథకం సాధించారు. అలాగే 100 మీటర్ల బాక్ స్టోక్ పోటీలో జోనా సిల్వర్, 200 మీటర్ల బ్యాక్ స్టోక్ బ్రౌంజ్ సాధించినట్లు కోచ్ తెలిపారు. 800 మీటర్లలో అభిషేక్ బ్రౌంజ్, 400 మీటర్లలో ఐలిన్ బ్రౌంజ్ 100మీటర్లు బాక్ స్టోక్ పోటీలో విష్ణుకుమార్ బ్రౌంజ్ మెడల్స్ సాధించి రాష్ట్ర స్థాయిలో పోటీలకు సిద్దమవుతున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..