హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒక మేకవన్నె పులి అని,. బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర అని తీవ్రంగా విమర్శించారు కరీంనగర్ కు చెందిన మంత్రి గంగుల కమలాకర్.. టిఆర్ ఎస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, . ఆయన హుజురాబాద్‌కు వెళ్తే బీసీ అని.. హైదరాబాద్‌కు వస్తే ఓసీ అని ఎద్దేవా చేశారు…అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డితో, కిరణ్ కుమార్‌రెడ్డితో తాను మాట్లాడాను అని ఈటల చెబుతున్నారని అయితే . కేవలం దేవరయాంజల్ భూముల కోసమే ఆయన మాట్లాడారంటూ గంగుల కౌంటర్ ఇచ్చారు… ముదిరాజ్‌లు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వారికి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారని, ఇవాళ పదవి పోగానే ముదిరాజ్‌లు గుర్తుకు వస్తున్నారని మండిపడ్డారు.. పదవిలో ఉన్నప్పుడు ముదిరాజ్‌లను ఎందుకు దగ్గరకు తీయలేదు? అని గంగుల కమలాకర్ ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదువుకున్నానని చెప్పిన ఈటల ఇంత తక్కువ సమయంలో వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయాలు ఎలా సంపాదించారని నిలదీశారు… మెడికల్ కాలేజీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.. పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చి, ప్రభుత్వంలో అన్ని రకాల పదవులు ఇచ్చినందుకే ఇవన్నీ సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని బాధ పడిన వ్యక్తి ఈటల రాజేందర్ అని తెలిపారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆరుసార్లు కేసీఆర్ బొమ్మ మీదనే గెలిచావు అంటూ ఈటలకు ధీటుగా సమాధానం ఇచ్చారు… టీఆర్ఎస్ పార్టీ అన్ని ఎన్నికల్లో గెలుస్తుందంటే.. దానికి కారణం కేసీఆర్ బొమ్మ అని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఈటల మేక వన్నె పులి – మంత్రి గంగుల..
By sree nivas
- Tags
- counter
- etala
- gangula kamalakar
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement