Friday, November 22, 2024

గేమింగ్ కోర్సులు జాబ్ గ్యారెంటీని అందిస్తాయి.. అక్షయ్ ముంజాల్

గేమింగ్‌ కోర్సులు సమగ్రమైన కెరీర్‌ మద్దతు అందించడంతో పాటుగా ఉద్యోగ హామీని సైతం అందిస్తాయని హీరో విరెడ్ ఫౌండ‌ర్ అండ్ సీఈఓ అక్ష‌య్ ముంజాల్ తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ… గత కొద్ది సంవత్సరాలుగా గేమింగ్‌, ఈస్పోర్ట్స్‌ పరిశ్రమ అసాధారణ వృద్ధి నమోదుచేస్తుందన్నారు. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్‌ వినియోగదారులు కలిగిన రెండవ దేశంగా ఇండియా నిలువడంతో పాటుగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఇక్కడ ఎక్కువగానే ఉన్నారన్నారు. ఈ అంశాల కారణంగా భారతదేశంలో ఈస్పోర్ట్స్‌ పరిశ్రమ 45శాతం సీఏజీఆర్‌ వృద్ధితో 2025 నాటికి 11 బిలియన్‌ రూపాయలకు చేరుకోవచ్చని ఈవై అధ్యయనం రెడీ.సెట్‌.గేమ్‌ ఆన్‌! వెల్లడిస్తుందన్నారు. భారతదేశంలో 450కు పైగా గేమింగ్‌ కంపెనీలు, 450 మిలియన్‌లకు పైగా గేమర్లు ఉన్నారని కూడా అంచనా వేసిందన్నారు. అయితే దురదృష్టవశాత్తు యువతతో పాటుగా వారి తల్లిదండ్రులకు కూడా గేమింగ్‌ పట్ల సరైన అవగాహన లేదంటున్నారు హీరో విరెడ్‌ ఫౌండర్‌–సీఈఓ అక్షయ్‌ ముంజాల్‌. ఈ రంగంలో అపారమైన అవకాశాలున్నాయంటూ ఆ అవకాశాలను అందిపుచ్చుకునేలా తాము యువతకు తోడ్పడే ప్రయత్నం చేస్తున్నామంటున్నాని తెలిపారు. తాము రూపొందించిన గేమింగ్‌ కోర్సులు ఈ గేమింగ్‌ పరిశ్రమలో ప్రవేశించేందుకు తగిన తోడ్పాటునిస్తుందని వెల్లడించారు.

తమ గేమింగ్‌ కోర్సు వినూత్నమైనదని వెల్లడించిన ముంజాల్‌ నాడ్విన్‌ గేమింగ్‌ సహకారంతో ప్రత్యేకంగా సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించామన్నారు. ఆరు నెలల పాటు జరిగే ఈ కోర్సుతో ఔత్సాహికులు గేమింగ్‌, ఈ స్పోర్ట్స్‌ పరిశ్రమలో పలు ఉద్యోగాలు అంటే గేమ్‌ డిజైనింగ్‌, విజువలైజింగ్‌, పబ్లిషింగ్‌, లీగ్‌ ఆపరేషన్స్‌, కంటెంట్‌ క్రియేషన్‌, లైవ్‌ ప్రొడక్షన్‌ తదితర విభాగాల్లో పొందవచ్చన్నారు. ఈ కోర్సులో మొదటి రెండు నెలలూ ప్రైమర్‌గా ఉన్నప్పటికీ, ఆ తరువాత నాలుగు నెలలు మాత్రం స్పెషలైజేషన్‌ తీసుకోవచ్చన్నారు. ఈ ప్రోగ్రామ్‌ ఫీజు నాలుగు లక్షల రూపాయలు కాగా, ఈ ఫీజులో 50శాతంను వినూత్నమైన గ్యారెంటీడ్‌ 5 నెలల ఇంటర్నెషిప్‌ కార్యక్రమంతో తిరిగి పొందవచ్చన్నారు. సంప్రదాయ విద్యాసంస్థల బోధనకు విభిన్నంగా ఆన్‌లైన్‌ మూక్స్‌పై దృష్టి సారించి లైవ్‌ డెలివరీ, డీప్‌ ఇండస్ట్రీ లింకేజ్‌లపై దృష్టి సారించామన్న ముంజాల్‌ పరిశ్రమతో అతి సన్నిహితంగా పనిచేయడం ద్వారా వారికి ఏమి అవసరమో తెలుసుకుని తదనుగుణంగా శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ ప్రోగ్రామ్‌తో అభ్యాకులు పరిశ్రమ ప్రొఫెషనల్స్‌తో సంభాషించే అవకాశం కలుగుతుందంటూ ప్రతి అభ్యాసకుని నైపుణ్యాలను గుర్తించి, వారి కోరికలనుగుణంగా అవకాశాలను అందించేలా తీర్చిదిద్దడం చేస్తామన్నారు. అంతేకాకుండా గైడెడ్‌ ఇండస్ట్రీ ప్రాజెక్ట్‌తో ఈ కార్యక్రమం ముగుస్తుందని, దీనికి పరిశ్రమ నిపుణులు మద్దతు అందిస్తారని వెల్లడించారు. గేమింగ్‌ పరిశ్రమతో అతి సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల మరింత మెరుగ్గా తమ కోర్స్‌ కరిక్యులమ్‌ తీర్చిదిద్దామన్నారు ముంజాల్‌. పరిశ్రమ నిపుణులతో కలిసి పనిచేయడం వల్ల అభ్యాసకులను భవిష్యత్‌కు సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దగలమంటూ, ఈ ప్రోగ్రామ్‌ రూపకల్పన వేళ అగ్రగామి స్థానిక, అంతర్జాతీయ స్టూడియోలు, ప్రచురణ సంస్థలతో భాగస్వామ్యం చేసుకుని అంతరాలు పూరించేలా రూపొందించామన్నారు. నోడ్విన్‌ తో పాటుగా యునిటీ, ఎన్‌ఎస్‌డీసీ, ఎంఈఎస్‌సీలను సర్టిఫికెట్‌ భాగస్వాములుగా, గేమ్‌ఆన్‌, హోలీ కౌ ప్రొడక్షన్స్‌, గాడ్‌స్పీడ్‌ గేమ్స్‌, మూన్‌ఫ్రాగ్‌లను ఇండస్ట్రీ భాగస్వాములుగా కలిగి ఉన్నామన్నారు. గేమింగ్‌, ఈస్పోర్ట్స్‌ పరిశ్రమలో రాణించడానికి ఈ సర్టిఫికేషన్‌ కోర్సు సహాయపడుతుందంటున్నారు. హీరో విరెడ్‌ లక్ష్యం పరిశ్రమలో మొట్టమొదటి, నూతన తరపు ప్రోగ్రామ్‌లను అందించడమేనంటూ, ఈ కోర్సులు చేసిన వారు గేమ్‌ డెవలపర్‌, గేమ్‌ ఆర్టిస్ట్‌, గేమ్‌ డిజైనర్‌. గేమ్‌ ఆడియో ఇంజినీర్‌ వంటి ఉద్యోగాల్లో రాణించవచ్చన్నారు. ఈ –స్పోర్ట్స్‌ను స్పెషలైజేషన్‌గా తీసుకుంటే లీగ్‌ ఆపరేషన్స్‌, కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌, గేమ్‌ మార్కెటింగ్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర బాధ్యతలను నిర్వర్తించవచ్చని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement