Friday, November 22, 2024

మిల్లెట్స్‌ను గోల్డ్‌డ్రాప్‌ నూనెలో వేయిస్తే మరింత రుచి…మితేష్‌ లోహియా

రోజువారీ పోషక అవసరాలు తీర్చుకోవడం కోసం మిల్లెట్స్‌ను కొద్దిగా రోస్ట్‌ చేయడం లేదంటే, చక్కటి నాణ్యత కలిగిన గోల్డ్‌డ్రాప్‌లాంటి నూనెలో వేయించి తింటే మరింత రుచిగా ఉంటుంద‌ని గోల్డ్‌డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ…. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఫుడీస్‌, హోమ్‌ చెఫ్‌లు తమ అభిమాన ఫుడ్స్‌కు ఓటు వేయడంతో అవి ఆ సంవత్సరపు అభివృద్ధి చెందే ధోరణులగా మారుతుంటాయన్నారు. భారతదేశంలో 2023 సంవత్సరపు ఫుడ్‌ ట్రెండ్స్ లో వైవిధ్యమైనది చీజ్ అన్నారు. ఇది విభిన్నరూపాలు, రుచులలో లభిస్తుందన్నారు. దీనిని కూరగాయలు, లేదంటే రోటీ, పుల్కాపై కూడా టాపింగ్‌ చేసుకోవచ్చన్నారు. ఇంకా వైవిధ్యత చూపాలనుకుంటే నాచోస్‌, చిప్స్‌, పాప్‌కార్న్‌, కాక్రాస్‌, స్పగెట్టిపై కూడా ఉంచవచ్చన్నారు.

ఒకవేళ స్పగెట్టితో కలిపి తీసుకుంటే వేయించిన వెల్లుల్లి, నలగ్గొట్టిన మిరియాలు మరువొద్దన్నారు. అంతర్జాతీయ ధోరణి అయిన ఫాండ్యూ లాంటివి తెలంగాణాలో కూడా కనబడుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా తృణధాన్యాల సంవత్సరంగా 2023ను జరుపుతున్నారన్నారు. తెలంగాణాలో తృణధాన్యాలను సూపర్‌ఫుడ్స్‌గా చెబుతుంటారన్నారు. ఈ మిల్లెట్స్‌ను ఉప్మా, దోశల రూపంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తినడంతో పాటుగా లంచ్‌, డిన్నర్‌లో రైస్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చన్నారు. ఖీర్‌, లడ్డూ తరహా రుచులనూ ఆస్వాదించవచ్చన్నారు. ఫుడ్‌ అంటేనే ప్రయోగాలు చేయడమ‌న్నారు. ప్రతి సంవత్సరం విభిన్నమైన ధోరణులు ఈ ఫుడ్‌లో కనిపిస్తాయన్నారు. తెలంగాణాలో మనం ప్రత్యేకంగా ఈ వంటకాలను రూపొందించడం వల్లనే అంతర్జాతీయంగా వాటి ఖ్యాతి లభించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement