Tuesday, November 26, 2024

రేపు హైద‌రాబాద్ సిటీలో మంచినీటి సరఫరా బంద్‌.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే..

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌: మహా నగరంలో ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ నెల 2న ఉదయం 6 నుంచి 3న ఉదయం 6 గంటలు అంటే 24 గంటల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఎందుకంటే మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్‌-3కి సంబంధించి ఇక్రిశాట్‌ వద్ద 1200 ఎం.ఎం డయా పీఎస్‌సీ గ్రావిటీ మెయిన్‌ కు మరమ్మత్తులు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నీటి లీకేజీలు అరికట్టడానికి ఈ పనులు చేపట్టడం జరుగుతోందని వాటర్‌బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

అంతరాయం కలిగే ప్రాంతాలు ఇవే:

వాటర్‌బోర్డు డివిజన్‌-9, 15, 24 డివిజన్లు పరిధిలోని బీహెచ్‌ఈఎల్‌ ఎంఐజీ, బీహెచ్‌ఈఎల్‌ ఎల్‌ఐజీ, చందానగర్‌, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్‌ గృహకల్ప, నల్లగండ్ల, హుడాకాలనీ, గోపన్‌పల్లి, లింగంపల్లి, గుల్‌మహర్‌ పార్కు, నెహ్రూనగర్‌, గోపినగర్‌, దూబే కాలనీల్లో 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదని తెలిపారు. గోపాల్‌నగర్‌, మయూరినగర్‌, మాదాపూర్‌, ఎస్‌ఎంఆర్‌, గోకుల్‌ ప్లాట్స్‌, మలేషియా టౌన్‌షిప్‌, బోరబండ రిజర్వాయర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో లోప్రెషర్‌తో నీటి సరఫరా జరగనుంది. అందువల్ల మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగనున్న ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్‌బోర్డు ప్రత్యేకంగా వినియోగదారులను కోరినట్లు ప్రకటనలో తెలియజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement