హైదరాబాద్, : కరోనా మృతదేహాల అంత్య క్రియల కోసం ఉచితంగా కట్టెలను సరఫరా చేస్తామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రకటిం చారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో నమోదవుతున్న కరోనా మరణాల కారణంగా మృతుల దహనానికి స్మశానాల్లో కట్టెలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిసథితుల్లో స్పందిం చిన ఫారెస్టు కార్పోరేషన్ తమ దగ్గర ఉన్న సుమారు 1000 టన్నుల కలపను ఉచితంగా కోవిడ్ మృతుల అంత్యక్రి యలకు అందించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌తో సహా సమీప మున్సిపాలిటీ స్మశానాలకు కట్టెలను సరఫరా చేయనున్నట్లు కార్పోరేషన్ ఛైర్మన్ వంటేరు తెలిపారు. పెరిగిన కలప ధరల కారణంగా పేదలకు కరోనా మృతుల దహనసంస్కారాలు భారం కావడంతో రూ.20లక్షల విలువైన కలపను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
మృతదేహాల అంత్య క్రియల కోసం ఉచితంగా కట్టెలు
By sree nivas
- Tags
- crimitions
- free
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
- wood
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement