మరోమారు తమ సత్తా చాటుతూ బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లోని భారతీయ విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫార్ములా స్టూడెంట్ నెదర్లాండ్స్ 2022 పోటీ (ఎఫ్‌ఎస్‌ఎన్)లో మూడవ స్థానంలో నిలిచారు. ఈసందర్భంగా బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసన్ మడపుసి మాట్లాడుతూ… కెరీర్ మీద దృష్టి సారించి విద్యనందించడం వల్లనే మిగిలిన వారికి భిన్నంగా బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ నిలుస్తుందన్నారు. ఎఫ్‌ఎస్‌ఎన్ లాంటి పోటీలతో తమ విద్యార్థులు, వాస్తవ ప్రపంచపు వర్క్ అనుభవాన్ని గ్రాడ్యుయేషన్‌కు ముందుగానే పొందుతున్నారన్నారు. యూరోపియన్, అంతర్జాతీయ స్థాయిలో జరిగే అతిపెద్ద పోటీ ఎఫ్‌ఎస్‌ఎన్ అన్నారు. ఈ బృంద సభ్యుడు శోభల్ ఫిలిప్ రాయ్ మాట్లాడుతూ… ఈ కారును 9 నెలల పాటు ప్రణాళిక చేసి, తీర్చిదిద్దామన్నారు. తమ టీమ్ మద్దతు అందించడంతో పాటుగా ఈ కారు అభివృద్ధిలో అణువణువూ తోడ్పడ్డారన్నారు. రాబోయే సంవత్సరాలలో మరిన్ని కార్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇవి పూర్తి పర్యావరణ అనుకూలంగా ఉంటాయని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement