హైదరాబాద్ నగరంలో ట్రాపిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మరి కాసేపట్లలో హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుండడంతో ఎన్టీఆర్ మార్గ్, మింట్ కంపౌండ్ వైపు రాకపోకలను బంద్ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్నాయి. పలు మార్గాల్లో ఆంక్షలు ఇలా… వీవీ విగ్రహం(ఖైరతాబాద్) వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. వీవీ విగ్రహం వద్ద షాదాన్ కాలేజ్, రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు.
బుద్దభవన్, నల్లంపట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. రసూల్‌పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ఫ్లై ఓవర్‌పై నుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి. ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు.
తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు వెళ్లాలి. బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్‌మినార్, రవీంద్ర భారతి జంక్షన్‌కు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్‌కంపౌండ్ వైపు వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ వైపు నుంచి ప్రింటింగ్ ప్రెస్, నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణేష్ వద్ద రాజ్‌దూత్ లైన్‌లోకి మళ్లిస్తారు.