భారీగా విదేశీ కరెన్సీ కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారుల సోదాల్లో ముప్ఫయి లక్షల విలువ చేసే యూఎస్ డాలర్లు దొరికాయి. తొలుత సీఐఎస్ఎఫ్ అధికారులు ఈ విదేశీ కరెన్సీని గుర్తించారు. ప్రయాణికుడిని ప్రశ్నించగా నీళ్లు నమిలాడు. షార్జా వెళ్లేందుకు మహమూద్ ఆలీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు.అధికారులకు అనుమానం రాకుండా యూఎస్ డాలర్స్ ను తన లగేజీ బ్యాగ్ లో దాచి తరలించేందుకు మహమూద్ ఆలీ ప్రయత్నించారు. మహమూద్ ఆలీని అరెస్ట్ చేసిన అధికారులు అతనిపై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement