Friday, November 22, 2024

స్వీట్ బాక్స్ లో విదేశీ కరెన్సీ..

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. హైదరాబాద్ కస్టమ్స్..సిఐఎస్ ఎఫ్ సమన్వయంతో పట్టుకోగలిగారు. దుబాయ్‌కి బయలుదేరిన ఓ ప్యాసింజర్‌ రూ.1.13 కోట్ల విదేశీ కరెన్సీ తరలిస్తుండగా కస్టమ్స్, సిఐఎస్ఎఫ్ పోలీసులకు చిక్కాడు. విచిత్రమేంటంటే ఇతగాడు స్వీట్ బాక్స్‌లో ఆ కరెన్సీని దాచి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు గమనించి స్వీట్ బాక్స్ ఓపెన్ చూసి చూడగా అందులో కరెన్సీ లభ్యమైంది. దీంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement