Friday, November 22, 2024

ఆసరా పెన్షన్ కోసం.. పెన్షన్ దారుల అవ‌స్థ‌లు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు అందిస్తున్న ఆసరా పెన్షన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఇస్తారో తెలియక పెన్షన్ దారులు రోజూ పోస్టాఫీస్ వద్ద పడిగాల్పులు కాస్తున్నారు. గతంలోనే పెన్షన్ అమౌంట్ సంబంధిత పెన్షన్ దారుని బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయడానికి సంబంధిత పెన్షన్ దారుల నుండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నారు. అయితే అది ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. మారుమూల‌ గ్రామాల్లో కూడా పెన్షన్ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తున్నప్పటికీ.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం పెన్షన్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వ‌స్తోంది.

పెన్షన్ తీసుకోవడానికి గంటల తరబడి క్యూలో నిల్చడానికి ఓపిక లేక వృద్ధులు, వికలాంగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో కూడా ఈ విషయాన్ని అనేకమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఎలాంటి చలనం లేదు. ఇప్పటికైనా పెన్షన్ దారుల‌ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేసే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని, లేదంటే పెన్షన్ దారులతో నిరసన కార్యక్రమం చేపడతామ‌ని లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ భిక్షపతి యాదవ్ హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement