Tuesday, November 26, 2024

SNDP పనులతో వరద నీటి సమస్య పరిష్కారం.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, సెప్టెంబర్ 13 (ప్రభ న్యూస్) : లోతట్టు ప్రాంతమైన లింగోజిగూడ డివిజన్ లో గతంలో వర్షం వస్తే కాలనీ వాసులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. లింగోజిగూడా డివిజన్ పరిధిలోని తపోవన్ కాలనీ ఫేస్.1లో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కాలనీ ముఖద్వారాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు పాల్గొని కాలనీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… గతంలో చిన్నపాటి వర్షానికి కాలనీ మొత్తం వరదనీటిలో మునిగిపోవడం జరిగేది, ఇండ్లు అమ్ముకొని వెళ్లిపోయే పరిస్థితి కూడా ఏర్పడిందని గుర్తు చేశారు. మొన్న కురిసిన వర్షాలకు కాలనీ నందు వరదనీరు నిలవడకపోవడం పట్ల కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎస్.ఎన్.డి.పీ. ద్వారా నిర్మిస్తున్న నాలాల పనుల వల్ల ఇప్పుడు సత్పలితాలు ఇస్తున్నాయని తెలిపారు. డివిజన్ పరిధిలోని ధర్మపురి కాలనీ, సాయి నగర్ కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీ, అల్తాఫ్ నగర్, తప్పో వన్ కాలనీలో వర్షం వస్తుందంటే ప్రజలు భయంతో ఉండేవారని, నాళాలు నిర్మించడంతో ఆ పరిస్థితి లేదన్నారు. పూర్తిగా ఎస్ ఎన్ డి పి పనులు జరిగితే వరద నీటి సమస్య పూర్తిగా తీరుతుందన్నారు.


నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ… కాలనీలో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముద్రబోయిన శ్రీనివాసరావులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తోట రాజశేఖర్ రెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త మధుసాగర్, అండే కార్ ఇంద్రజీ, రావులకొల్లు ప్రకాష్, ప్రసాద్ కాలనీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సెక్రటరీ రవికుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ గౌడ్, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజర్ మహేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement