Thursday, November 21, 2024

పుదుచ్చేరి నుంచి హైద‌రాబాద్ కు విమాన స‌ర్వీసులు పునఃప్రారంభం

పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ కృషి కారణంగా హైదరాబాద్‌ – పుదుచ్చేరి – హైదరాబాద్‌ల మధ్య విమానాలు జనవరి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా రద్దయిన పుదుచ్చేరి – హైదరాబాద్‌ విమానాలను తిరిగి పునరుద్దరించాలంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి గవర్నర్‌ లేఖలు రాయడంతో పాటు టెలిఫోనిక్‌ కాల్స్‌ పుదుచ్చేరి – హైదరాబాద్‌ల మార్గంలో నేరుగా విమా కనెక్టివిటీని పునరుద్దరించాలని కోరారు. ఫలితంగా విమాన కనెక్టివిటీని పునరుద్దరించడంతో పాటు స్పైస్‌ జెట్‌కు వయాబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద మద్ధతును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

ఎయిర్‌ కనెక్టివిటీ పునరుద్ధరణతో హైదరాబాద్‌, పుదుచ్చేరిల మధ్య సందర్శనలకు ప్లాన్‌ చేసి పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రాజ్‌భవన్‌ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. తెలంగాణ టూరిజం విభాగం కారైక్కల్‌ సమీపంలోని ప్రసిద్ధ వేలంకన్ని చర్చి, నాగోర్‌ దుర్గా, తిరునల్లార్‌ శనీశ్వర్‌ దేవాలయాన్ని కలుపుతూ, తమిళనాడుతోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మహాబలిపురంలో కూడా ఆధ్యాత్మిక పర్యటనలను నిర్వహించవచ్చని గవర్నర్‌ సూచించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పుదుచ్చేరి నుంచి హైదారాబాద్‌, తెలంగాణ రాష్ట్రంలోని ఇతర పర్యాటక ప్రదేశాలకు సందర్శనలు నిర్వహించవచ్చని గవర్నర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement