తనివితీరా షాపింగ్ చేసేందుకు తగిన సయయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇనార్బిట్ మాల్ అన్‌బాక్సింగ్ హ్యాపీనెస్ సేల్ ఇప్పుడు ప్రారంభమైంది. జూలై 1–3 తేదీల్లో దాదాపు 50కు పైగా బ్రాండ్లపై ఫ్లాట్ 50శాతం తగ్గింపును అందిస్తున్నారు. అస్సలు వదులుకోలేనట్టి రీతిలో డీల్స్, డిస్కౌంట్లను సైతం అందిస్తూ ప్రతి కొనుగోలుదారుని మోము సంతోషంతో వికసించేలా చేస్తున్నారు. ఈ మూడు రోజులూ మాల్ రాత్రి 10 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఈ ఫ్లాట్ 50శాతం తగ్గింపు అమ్మకాలు వారాంతంలో మాత్రమే అందుబాటులో ఉన్నా, అన్ బాక్సింగ్ హ్యాపీనెస్ సేల్ మాత్రం జూలై 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయని ఆసంస్థ తెలిపింది.
ఈ ఆనందాన్ని మరింత విస్తరిస్తూ ఈ 50శాతం రాయితీని 50కు పైగా బ్రాండ్లపై అందిస్తున్నారు. ఈ బ్రాండ్లలో ప్రీమియం అప్పెరల్, బ్యాగ్స్, ఫిట్‌నెస్, ఫుట్‌వేర్, యాక్సససరీ బ్రాండ్లు అయినటువంటి హెచ్ అండ్ ఎం, ఫరెవర్ న్యూ, స్కెచర్స్, పూమా, చార్లెస్ అండ్ కీత్, బాత్, బాడీ వర్క్, లాకొస్టె, ఆల్డో వంటివి ఉన్నాయి. షాపర్స్ ఇప్పుడు ఫ్లాట్ 50శాతం తగ్గింపును ఎంపిక చేసిన వస్తువులపై లైఫ్‌స్టైల్, షాపర్స్ స్టాప్, పాంటాలూన్స్, మార్క్స్ అండ్ స్పెన్సర్స్, మ్యాక్స్ వద్ద అందుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.