Tuesday, November 26, 2024

ఈనెల 22న ఫిట్ జీ బిగ్ బ్యాంగ్ ఎడ్జ్ టెస్ట్

హైదరాబాద్ : నేటి అత్యంత పోటీ ప్రపంచంలో, తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా సామర్థ్యాన్ని, అవకాశాలను తెలుసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఫిట్ జీ, ప్రఖ్యాత పోటీ పరీక్షలకు విద్యార్థులను శక్తివంతం చేయడంలో వారి తపనను నెరవేరుస్తుంది. అకడమిక్ ఎక్సలెన్స్ కోసం విద్యార్థులను సిద్ధం చేసే వారసత్వాన్ని ఫిట్ జీ కలిగి ఉంది. ఈ మహోన్నత లక్ష్యంలో భాగంగా ఇది బిగ్ బ్యాంగ్ ఎడ్జ్ టెస్ట్‌ను ఆవిష్కరించింది.ఫిట్ జీ బిగ్ బ్యాంగ్ ఎడ్జ్ పరీక్షను అక్టోబర్ 22, 29 తేదీల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తుంది.

ఈసందర్భంగా ఫిట్ జీ హైదరాబాద్ సెంటర్స్ మెంటార్-డైరెక్టర్ డాక్టర్ ఆనంద రామన్ మాట్లాడుతూ… ఫిట్ జీ నిస్సందేహంగా పోటీ పరీక్షల తయారీ రంగంలో బంగారు ప్రమాణాన్ని నెలకొల్పిందన్నారు. విద్యార్థులను విజయం కోసం తీర్చిదిద్దడంలో ఇన్‌స్టిట్యూట్ చూపుతున్న అసమానమైన అంకితభావం అభినందనీయమన్నారు. ఫిట్ జీ గ్రూప్ డైరెక్టర్ ఆర్ఎల్ త్రిఖా మాట్లాడుతూ… ఏదైనా కెరీర్ అండ్ జీవితంలో విజయానికి లోతైన అవగాహన, విశ్లేషణాత్మక నైపుణ్యాలు కీలకమన్నారు. కాబట్టి ఫిట్ జీ బిగ్ బ్యాంగ్ ఎడ్జ్ టెస్ట్ విద్యార్థులకు వారి విశ్లేషణాత్మక నైపుణ్యాలు, ఐక్యూ అండ్ ఇంజినీరింగ్, సాధారణంగా వివిధ రంగాల్లో ప్రతిఫలదాయకమైన కెరీర్‌లను అంచనా వేయడానికి సువర్ణావకాశాన్ని అందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement