Wednesday, November 20, 2024

HYD: పోకిరీలు వేధిస్తే నిర్భయంగా ఫిర్యాదు చేయండి… సీపీ తరుణ్ జోషి

ప్రభ న్యూస్, మల్కాజ్గిరి : బాలికలను, మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీమ్స్‌ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ డా.తరుణ్ జోషితెలిపారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ షీటీమ్స్ డెకాయ్‌ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడించే, వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ, వారిని, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నారన్నారు.

రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు ఈరోజు రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తున్న 147 (మేజర్స్-87, మైనర్స్-60) మందిని షీ టీమ్స్ పట్టుకున్నారు. వారికి ఎల్‌బి నగర్ సీపీ క్యాంప్ ఆఫీస్ (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు) లో, కౌన్సిలర్స్ తో వారి కుటుంబ సభ్యుల‌ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గ‌త నెల తేదీ 16 నుండి 31 వరకు 183 ఫిర్యాదులు అందాయ‌ని, రాచకొండ విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి.ఉషా విశ్వనాథ్ తెలిపారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ డి.‌సి.‌పి టి.ఉషా విశ్వనాథ్, ఏ‌సీపీ వెంకటేశం, అడ్మిన్ ఎస్‌ఐ రాజు షీ టీమ్స్‌ సిబ్బంది, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement