Friday, November 22, 2024

Vizag: గాజువాకలో ఫ్యాషన్ బ్రాండ్ రంగిత మొదటి స్టోర్ ప్రారంభం

హైదరాబాద్ : స్టెల్లారో బ్రాండ్స్‌కు చెందిన ప్రముఖ డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ రంగిత, విశాఖపట్నంలోని సీఎంఆర్ సెంట్రల్ గాజువాకలో తన మొదటి ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్‌లెట్‌ను ఘనంగా ప్రారంభించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల ప్రజల ఫ్యాషన్ అవసరాలను తీర్చడం ద్వారా, ప్రియమైన ఆన్‌లైన్ బ్రాండ్ నుంచి భౌతిక రిటైల్ ఉనికితో రంగిత ఒక మైలురాయిని నెలకొల్పింది. ప్రారంభోత్సవానికి ప్రముఖ భారతీయ నటి మేఘనా లోకేష్ హాజరయ్యారు.


కొత్త స్టోర్ ప్రారంభం గురించి స్టెల్లారో బ్రాండ్స్ సీఈఓ హిమాన్షు చక్రవర్తి మాట్లాడుతూ… విశాఖపట్నంలో తమ మొదటి భౌతిక స్టోర్‌ను ప్రారంభించడం భారతీయ మార్కెట్ ఫ్యాషన్ అవసరాలను సమగ్రంగా తీర్చాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా ఒక అడుగు ముందుకు వేశామన్నారు. తమ విధానం ఎల్లప్పుడూ కస్టమర్-సెంట్రిక్, ఈ విస్తరణ మల్టీ ఛానెళ్లలో అందుబాటులో ఉండాలనే తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని తమ కొత్త స్టోర్ కేవలం షాపింగ్ గమ్యస్థానం మాత్రమే కాదు, ఇది రంగిత శక్తివంతమైన ప్రపంచానికి ప్రవేశ ద్వారమన్నారు. ఇక్కడ సంప్రదాయం ఆధునికతతో అనుసంధానం అవుతుందన్నారు. ప్రతి వినియోగదారుడు తమ పరిపూర్ణ స్టైల్ వ్యక్తీకరణను కనుగొనవచ్చని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement