ఉప్పల్ : ఉప్పల్ సర్కిల్ పరిధిలోని కావేరినగర్ వద్ద ఉన్న ఎస్సార్-యాదాద్రి ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంక్)లో కల్తీ డీజిల్ విక్రయిస్తున్నారంటూ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన ఓ వాహనదారుడు తన ట్రాలీ వాహనంలో కావేరినగర్ వద్ద గల ఎస్సార్ పెట్రోల్‌బంక్‌లో రూ.1050 డీజిల్‌ను పోయించి, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేశాడు. అయితే అప్పటివరకు అంతా బాగానే ఉన్నప్పటికీ సదరు వాహనదారుడు నగరంలోని చంద్రాయణగుట్టకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో వాహనం ఆగిపోవడంతో వాహనాన్ని సదరు షోరూంలో అప్పగించి ఇంటికి వచ్చేశాడు. వాహన షోరూం వెళ్లగా కల్తీ డీజిల్ వలన వాహనం పాడవడం జరిగిందని మెకానిక్ చెప్పినట్లు వాహనదారుడు తెలియచేశాడు. దీంతో బాధితుడు స్థానిక యువకులతో కలిసి పెట్రోల్ బంక్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులకు, ఏఎస్‌ఓకు ఫిర్యాదు చేయగా.. ఏఎస్‌ఓ సరస్వతి అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. పెట్రోల్ బంక్‌లో పెట్రోల్, డీజిల్ నాణ్యతను పరిశీలించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని, దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement