Saturday, November 23, 2024

లూబ్రిక్రెంట్ తయారీ ప్లాంట్ నిర్మించేందుకు సిద్ధమైన ఎక్సాన్ మొబిల్

రాయ్‌గఢ్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన ఇసాంబే ఇండస్ట్రియల్ ఏరియాలో లూబ్రికెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను నిర్మించడానికి ఎక్సాన్ మొబిల్ దాదాపు రూ.900 కోట్లు (110 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. కంపెనీ ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, మహారాష్ట్రకు చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో ఈ ప్రకటన చేసింది.

ఈసంద‌ర్భంగా ఎక్సాన్ మొబిల్ అఫిలియేట్ ల లీడ్ కంట్రీ మేనేజ‌ర్ మోంటే డాబ్స‌న్ మాట్లాడుతూ… త‌మ‌ తొలి గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడితో భారతదేశం పట్ల త‌మ దీర్ఘకాలిక నిబద్ధతను మరింత బలోపేతం చేయడం పట్ల తాము గర్విస్తున్నామ‌న్నారు. మహారాష్ట్రలోని ప్లాంట్ అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటని, ఆకర్షణీయమైన పెట్టుబడి వాతావరణానికి కారణంగా త‌మ లూబ్రికెంట్ ప్లాంట్‌‌కు ఇది సహజ ఎంపికగా నిలిచిందన్నారు. ఎక్సాన్ మొబిల్ లూబ్రికెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ విపిన్ రాణా మాట్లాడుతూ… భారతదేశంలో అధిక పనితీరు కలిగిన లూబ్రికెంట్‌లను అందించే ప్రముఖ ప్రొవైడర్ల‌లో ఒకరిగా త‌మ స్థానాన్ని బలోపేతం చేసే దిశగా ఇది ఒక దశ మార్పు అన్నారు. స్థానికంగా తయారీ త‌మ సప్లై ఛైయిన్‌ను సులభతరం చేస్తుందన్నారు. త‌మ భారతీయ వినియోగదారులు, వినియోగదారుల అవసరాలను మరింత సులభంగా తీర్చడానికి త‌మకు వీలు కల్పిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement