Tuesday, November 26, 2024

చిన్న వ్యాపారాల కోసం ఉత్తేజ‌క‌ర‌మైన ఉత్ప‌త్తులు : వికాస్ బన్సల్


కస్టమర్స్ క్యాష్ నుండి డిజిటల్ చెల్లింపులకు తరలడంలో అమేజాన్ పే ఏ విధంగా సహాయపడింది ?
A. గత రెండేళ్లుగా, తాము ఐసీఐసీఐ బ్యాంక్ తో త‌మ సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్, అమేజాన్ పే లేటర్, అమేజాన్ పే యూపీఐ, చిన్న వ్యాపారుల కోసం వ్యాపారం కోసం అమేజాన్ పే వంటి కొన్ని ఉత్తేజభరితమైన ఉత్పత్తుల్ని ఆరంభించామని అమేజాన్ పే డైరెక్టర్, అమేజాన్ పే ప్ర‌తినిధి వికాస్ బ‌న్స‌ల్ తెలిపారు. ఈ ప్రోడక్ట్స్ లక్షలాది కస్టమర్స్ (రీటైల్ అండ్ ఎంఎస్ఎంఈ ఇరువురూ) డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని అనుభవించడంలో సహాయపడ్డాయి. రోజూవారీ చెల్లింపులు, యుటిలిటి బిల్స్, ఆర్థిక సేవలు (అకోతో భాగస్వామంలో) సహా ఎన్నో వినియోగం కేసుల్ని కూడా తాము అందిస్తున్నాము. ఢిల్లీ మెట్రో, బెంగళూరు మెట్రో, మేక్ మై ట్రిప్, రెడ్ బస్, ఇంకా ఎన్నో వాటి భాగస్వామంతో ప్రయాణం బుక్కింగ్స్, చెల్లింపుల్ని కూడా తాము మరింత సౌకర్యవంతం చేశాం. మరింతగా అభివృద్ధి చెందుతూ, త‌మ కస్టమర్స్ దైనందిన జీవితాన్ని సులభం చేయడానికి త‌మకు ఇప్పటికే ఉన్న ప్రోడక్ట్స్ ని పెంచడాన్ని కొనసాగిస్తాము. కస్టమర్స్ తమ అన్ని చెల్లింపుల అవసరాలు కోసం అమేజాన్ పేని అన్ని అవసరాలు తీర్చే వేదికగా ఉపయోగించేలా వారికి సాధికారత కలిగించడమే త‌మ ఉద్దేశ్యం. అమేజాన్ పే పై కస్టమర్స్ చెల్లింపుల సౌకర్యాన్ని అనుభవించినప్పుడు, తమ దైనందిన అవసరాలు, అనుభవాల కోసం దీనిని ఉపయోగించడాన్ని కొనసాగించే అవకాశముంద‌ని తాము భావిస్తున్నాము.

సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ తో, క్రెడిట్ సంస్క్రతిని కూడా భంగం కలిగిస్తూ, అమేజాన్ పే వారి సహ-బ్రాండెడ్ క్రెడిట్ పనితీరు ఎలా ఉంది ?
A. అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ రకాలలో విలక్షణమైనది. ఇది జాయినింగ్ ఫీజు లేకుండా, ఇతర ఉత్తేజభరితమైన ప్రయోజనాలతో సులభమైన రివార్డ్ వ్యవస్థని అందిస్తుంది. ఇది దేశంలో అతి వేగంగా పెరుగుతున్న కో-బ్రాండెడ్ కార్డ్ లలో ఒకటి, 2021లో 9వ పేమెంట్స్ ఇండస్ట్రీ అవార్డ్ లో సంవత్సరపు ఉత్తమమైన సహ-బ్రాండెడ్ కార్డ్ పురస్కారం గెలుపొందింది. ఇంకా, అమేజాన్.ఇన్ పై వివిధ డిజిటల్ శ్రేణులలో ఖర్చుల కోసం అనగా యుటిలిటి బిల్లు చెల్లింపులు, రీఛార్జెస్, ఇంకా ఎన్నో వాటి కోసం ప్రైమ్ సభ్యులు అదనంగా 5శాతం రివార్డ్స్ ని, నాన్-ప్రైమ్ కస్టమర్స్ అదనంగా 2శాతం రివార్డ్స్ ని ఆనందించవచ్చు. ఈరోజు కస్టమర్స్ సమగ్రమైన డిజిటల్ అనుభవాల్ని కోరుకుంటున్నారు. ఈ మైలురాయి త‌మ ప్రయత్నాలకు ఒక నిరూపణ. డిజిటల్ రంగం అందరికీ అందుబాటులో ఉంచే త‌మ ప్రయత్నాన్ని రెట్టింపు చేయడాన్ని తాము కొనసాగిస్తాము. నవీన, సరళమైన పరిష్కారాలతో త‌మ సరళమైన లోన్ ఆప్షన్ విస్తరిస్తున్నాము. అభిలాషల్ని నెరవేరుస్తున్నాము.

ఎస్ఎంబీలకు సాధికారత కలిగించడానికి అండ్ అధికారిక డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వారిని భాగంగా చేయడానికి అమేజాన్ పే ఏం చేస్తోంది?
A. చిన్న, మధ్యస్థ వ్యాపారాలు భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటివి. అమేజాన్ పేలో తాము సమాజాన్ని డిజిటలీకరణ చేయడానికి, వారి వ్యాపారాన్ని టెక్నాలజీ, పని మూలధనం రుణాలు ద్వారా పెంచడానికి నిరంతరం పని చేస్తున్నాం. ఇప్పుడు త‌మ వద్ద సుమారు 80 లక్షల మంది వ్యాపారులు 350 ప్ల‌స్ నగరాలు, పట్టణాలలో ఉన్నారు. తాము త‌మ వ్యాపారుల అనుభవాన్ని పూర్తిగా డిజిటలీకరణ చేశాము. ఇది అమేజాన్ పేని డిజిటల్ గా స్వీకరించడానికి సైన్ అప్ కోసం వ్యాపారులకు వీలు కల్పిస్తుంది. సౌకర్యం కోసం, హిందీ అండ్ ఇంగ్లీష్ లలో వాయిస్ నోటిఫికేషన్ తో పాటు బిజినెస్ కోసం త‌మకు అమేజాన్ పే యాప్ కూడా ఉంది. ఇది ఇబ్బందిరహితమైన అనుభవాన్ని సరళం చేస్తుంది. దీనికి అదనంగా, అమేజాన్ యాప్ ద్వారా వ్యాపారి ఆఫ్ లైన్ స్టోర్ లో ఉత్పత్తుల్ని నేరుగా తెలుసుకోవడానికి, రివార్డ్స్, ఈఎంఐ ఆఫర్స్ చూడటానికి, సురక్షితంగా కాంటాక్ట్ లెస్ చెల్లింపులు పూర్తి చేయడానికి వీలు కల్పించే త‌మ స్మార్ట్ స్టోర్స్ విజయంతో తాము ఉత్సాహంగా ఉన్నాము. త‌మ వ్యాపారుల నమ్మకంతో తాము వినమ్రంగా ఉన్నాము. స్మార్ట్ స్టోర్ విస్తరణ కార్యక్రమం 17వేల వ్యాపారుల కంటే ఎక్కువ మందిని చేర్చింది. దీని వాడకంలో గణనీయమైన వృద్ధిని కలిగించింది.

డిజిటల్ చెల్లింపుల కోసం నమ్మకం లోపాన్ని పరిష్కరించడానికి, ప్రతిరోజూ చెల్లింపుల్ని సులభం చేయడానికి అమేజాన్ పే ఎలా పని చేస్తోంది?
A. నవ్యత అంటే కేవలం కొత్త ఉత్పత్తుల్ని తయారు చేయడం లేదా పరిష్కారాలు కేటాయించమే కాకుండా నమ్మకం, భద్రతని కలిగించడం, దాని వాడకం గురించి చైతన్యం కలిగించడమ‌నే వాస్తవం గురించి తాము జాగ్రత్త వహిస్తున్నాము. దీన్ని సాధించడానికి, తాము ఇటీవల త‌మ సమీకృత కాంపైన్ #AbHarDinHuaAasan ని ఆరంభించాము. ఇది అమేజాన్ యాప్ లోనే లభించే అమేజాన్ పే పై ఉపయోగించే పలు కేస్ ల సౌకర్యం, భద్రతని ప్రధానాంశంగా తెలియచేస్తుంది. వివిధ మాధ్యమాల ద్వారా కాంపైన్ 100 మిలియన్ లకి పైగా కస్టమర్స్, వ్యాపారుల్ని చేరింది. వివిధ రోజూవారీ పరిస్థితుల్లో అమేజాన్ పే తమ జీవితాన్ని ఏ విధంగా సులభం చేసిందో కస్టమర్స్ అర్థం చేసుకోవడం వలన క్యాష్ లెస్ ఆర్థిక వ్యవస్థని రూపొందించే ఉద్యమంలో వారు చేరుతారని తాము ఆశిస్తున్నాము.

బీఎన్ పీఎల్ దిశగా పెరుగుతున్న ప్రాధన్యతలో, అమేజాన్ పే లేటర్ కోసం వచ్చిన ప్రతిస్పందన ఏ విధంగా ఉంది?
A. ద బై నౌ పే లేటర్ (బీఎన్ పీఎల్) సంస్క్రతి గడిచిన సంవత్సరాలుగా ఎంతో పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఒక సముచితమైన మార్కెట్ ని సృష్టించింది, అతి పెద్ద అంతరాలలో ఒకటి. సులభమైన క్రెడిట్ -ఆధారిత లోన్ వ్యవస్థ కోసం అవసరాన్ని పరిష్కరించింది. అమేజాన్ పే లేటర్ త‌మ ఫ్లాగ్ షిప్ క్రెడిట్ ఉత్పత్తుల్లో ఒకటి. ఇది త‌మ కస్టమర్స్ తమ నెలవారీ ఖర్చుల్ని మెరుగ్గా నిర్వహించడంలో సాధికారత కలిగించింది. ఇది మూడవ పక్షానికి చెందిన రుణ భాగస్వాములైన కాపిటల్ ఫ్లోట్ , ఐడీఎఫ్ సీ ఫస్ట్ భాగస్వామంతో అందించబడింది. కస్టమర్స్ అర్హతని బట్టి అందించబడింది. మారుతున్న కాలంతో, ఇప్పుడు సులభంగా అందుబాటులో ఉండే క్రెడిట్ కోసం, తమ బడ్జెట్ ని విస్తరించడానికి చూసే మిల్లీనియల్స్ జనాభా, వై తరం, జడ్ తరం పెరుగుతోంది. ఈ దృక్పథంలో లీనమైన త‌మ పరిష్కారాలు, బీఎన్ పీఎల్ విభాగంలో మార్గదర్శకులలో ఒకరిగా చేశాయి. అమేజాన్ పే లేటర్ 99.9శాతం చెల్లింపు విజయం రేట్ లో లావాదేవీలు నమోదు చేసాయి. సుమారు 40 లక్షలమంది కస్టమర్స్ ని కలిగి ఉండి, వారి నమ్మకం, అనుసరణకు ఒక స్పష్టమైన నిరూపణగా నిలిచారు. ఇది అమెజాన్.ఇన్ లో అన్ని ఉత్పత్తులు కోసం లభించే నో కాస్ట్ ఈఎంఐలు ( 0 శాతం వడ్డీ) తో పాటు కస్టమర్స్ వచ్చే నెల చెల్లించడానికి, రూ.60వేల‌ వరకు (కస్టమర్ అర్హతని బట్టి) ఉత్పత్తులు కోసం ఈఎంఐ ఎంపికలు సదుపాయాన్ని అందిస్తోంది. అభిలాషల్ని సాకారం చేయడంతో పాటు సౌకర్యవంతమైన, సరసమైన, సురక్షితమైన అనుభవాన్ని కేటాయించడంలో తాము విశ్వసిస్తామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement