తెలంగాణ సిద్ధాంత కర్తగా పేరొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని జి హెచ్ ఎం సి కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయంకర్ జయంతిని పురస్కరించుకొని జి హెచ్ ఎం సి ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అడిషనల్ కమిషనర్ లు, ఇ ఎన్ సి, సి ఈ, జోనల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్, సి పీ అర్ ఓ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగిన వారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక పుస్తకాలు రచించినట్లు కమిషనర్ తెలిపారు. జయశంకర్ స్ఫూర్తిని అందరూ అలవర్చుకోవాలని కమిషనర్ కోరారు. ఈసందర్భంగా ఈ వి డి ఏం విశ్వజిత్, అడిషనల్ కమిషనర్ శృతి ఓజా, బి సంతోష్, జయరాజ్ కెన్నెడీ, విజయ లక్ష్మి, వి.కృష్ణ, ఈ ఎన్ సి జియా ఓ ద్దీన్, సురేష్ కుమార్ సి ఇ దేవానంద్, సరోజి రాణి, టౌన్ ప్లానింగ్ ఆడిషన్ సీపీ శ్రీనివాస్, సీపీ అర్ ఓ ముర్తుజా, సెక్రెటరీ, లక్ష్మి,
జోనల్ కమిషనర్ లు మమత, పంకజ, శ్రీనివాసరెడ్డి, అశోక్ సామ్రాట్, తదితరులు పాల్గొని ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.