ఈనెల 12, 13, 14వ తేదీల్లో యూకేలోని మాంచెస్టర్ లో అంతర్జాతీయ బ్రిటిష్ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్ షిప్ జరిగిన జార్జ్ సి కార్నెల్ స్పోర్ట్స్ సెంటర్ దగ్గర గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యూరోపియన్ యూనియన్ టైక్వాండో ప్రెసిడెంట్ మొక్కను నాటారు. యూరోపియన్ సాంగ్ మూ క్వాన్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వరల్డ్ సాంగ్ మూ క్వాన్ జీఎం గై జోన్స్, గ్రాండ్ మాస్టర్ గిన్నీస్ రికార్డ్ హోల్డర్ జయంత్ రెడ్డి, బంగారు పతకం విజేత అబ్దుల్ ఖలీల్, అంతర్జాతీయ టైక్వాండో క్రీడాకారులు, బ్రిటీష్ టైక్వాండో ప్రెసిడెంట్ జోన్స్ మాట్లాడుతూ… మార్షల్ ఆర్ట్స్ మనిషికి ఎంత అవసరమో మొక్కలు నాటడం కూడా అంతే అవసరమని చెప్పారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపడుతున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. టైక్వాండో క్రీడాకారులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన తెరాస నేత డాక్టర్ కరాటే రాజు నాయక్ కి ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement