హైదరాబాద్, ఆంధ్రప్రభ : భవిష్యత్ తరాలకు మన దేశానికి చెందిన నాణేల చరిత్రను తెలిపే విధంగా హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో ఉన్న పాత మింట్ భవనాన్ని నాణేల మ్యూజియంగా మార్చారు. అజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నాణేల మ్యూజియంను సెక్యూరిటీ ప్రింటింగ్, మింటింగ్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పిఎంసిఐఎల్) సిఎండి తృప్తి పాత్ర ఘోష్ ప్రారంభించారు. 119 సంవత్సరాల చరిత్ర కలిగిన మింట్ భవనం శిథిలావస్థలో ఉందని, దానికి మరమత్తులు చేయించి మ్యూజియంను ఏర్పాటు చేశామన్నారు. ఈ మ్యూజియంలో నిజం కాలం నుంచి నేటి వరకు ఏ ఏ నాణలు, నోట్లు వాడారో ప్రజలకు తెలిజేసే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.
నిజాం పాలనలో 1803లో మింట్ భవనంలో నాణెల తయారీ ప్రారంభమైందన్నారు. 1997లో మింట్ కార్యపాలను హైదరాబాద్ శివారు చర్లపల్లి ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఆ ప్రాంతంలో వంద ఎకరాల విస్తీర్ణంలో మింట్ భవనం, నాణేల ముద్రణ నడుస్తోందన్నారు. ప్రపంచంలోనే నాణేలను తయారు చేసే అతి పెద్ద భవనంగా చర్లపల్లి మింట్‌కు ఖ్యాతి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పిఎంసిఎల్ మావన వనరుల విభాగం డైరెక్టర్ ఎస్. కె. సిన్హా, ఆర్ధిక విభాగం డైరెక్టర్ అజయ్ అగర్వాల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.