Tuesday, November 26, 2024

ఈఎస్ఐ స్కామ్ – 10 మంది ఇళ్ల‌లో ఈడి సోదాలు..

హైదరాబాద్: తెలంగాణలో జ‌రిగిన‌ ఈఎస్ఐ కుంభకోణం నేప‌థ్యంలో నేటి ఉదయం నుంచి నగరంలోని 10 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. ఆనాటి కార్మిక శాఖ మంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, నాయిని మాజీ పీఎస్ ముకుంద రెడ్డి, దేవికా రాణి, ఇతర నిందితుల ఇళ్ళల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు జరుపుతోంది. వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కుంభకోణం జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. స్కామ్‌కు పాల్పడి విదేశాలకు నగదు బదిలీ చేసినట్టు గుర్తించింది. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు సేకరించింది. విదేశాలకు నగదు బదిలీ చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేయాలని ఈడీకి ఏసీబీ లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఈడి సోదాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement