హైదరాబాద్ : వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను తుఫాను వాహనం ఢీకొట్టిన ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడటం బాధాకరం అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో మాట్లాడి, ఘటనకు దారి తీసిన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాడ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలను ఆదుకుంటామన్నారు. రోడ్లపై ప్రయాణాలను జాగ్రత్తగా చేయాలని, నిబంధనలు పాటిస్తూ, పరిమిత వేగంతో వెళ్ళాలన్నారు. వేగం కన్నా, ప్రాణం ముఖ్యమన్న సంగతిని గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement