Wednesday, November 20, 2024

గోల్డ్ డ్రాప్ ఆయిల్ తో రుచికరమైన వంటలు.. ఆస్వాదించండి!

హైదరాబాద్ : గోల్డ్ డ్రాప్ ఆయిల్ తో రుచిక‌ర‌మైన వంట‌ల‌తో ఆస్వాదించాల‌ని గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… తెలంగాణలోకి రుతుపవనాల రాకతో పాటు ఉర్రూతలూగించే రుచుల శ్రేణిని కూడా వెంట తీసుకువచ్చిందన్నారు. ఈ వర్షాకాలంలో తెలంగాణాలో అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని రుచికరమైన వంటకాలు చూస్తే…


మొక్క జొన్న చాట్ (కార్న్ చాట్) :
క్లాసిక్ ఫేవరెట్‌, మొక్క జొన్న చాట్తో ప్రారంభిద్దా. దీనిని కార్న్ చాట్ అని కూడా పిలుస్తారు. వర్షాకాల పు వైభవాన్ని అద్భుతంగా ఒడిసి పట్టే వంటకమ‌న్నారు. తాజాగా ఉడకబెట్టిన మొక్కజొన్న గింజలను శక్తివంతమైన మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, చింతపండు చట్నీతో కలిపి తయారు చేస్తారన్నారు. అస్సలు వదులుకోకూడదనే రుచులను మాత్రమే కాదు చిటపట చినుకులు పడుతున్న మరింత ఆనందమూ అందిస్తుందన్నారు.

- Advertisement -

కోడి కొర్రలు బజ్జి (చికెన్ వింగ్స్ భజ్జి):
మాంసాహార ప్రియులకు, తెలంగాణలో వర్షాకాలం తనతో పాటు కోడి కొర్రలు భజ్జి లేదా చికెన్ వింగ్స్ భజ్జి ని తెస్తుందన్నారు. చికెన్ వింగ్స్ ను తెలంగాణ ప్రత్యేకమైన స్పైసీ మిశ్రమంలో మెరినేట్ చేసి డీప్ ఫ్రై చేయబడతాయన్నారు.
వడలు, దాల్ వడలు :
బయట వర్షం కురుస్తున్న కొద్దీ, వేయించిన చిరుతిళ్లను తినాలనే కోరిక తీవ్రమవుతుందన్నారు. వడలు, దాల్ వడలను రుచి చూడండి. ఈ స్నాక్స్ కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో బాగా ఆనందించబడతాయన్నారు.
రోస్టెడ్ మొక్కజొన్న:
వేయించిన స్నాక్స్ ఆకర్షణ కాదనలేనిది అయితే, కొన్నిసార్లు వర్షాకాలంలో అతి చిన్న ఆనందం కూడా ప్రత్యేకంగానే ఉంటుందన్నారు. కాల్చిన మొక్కజొన్న అటువంటి ఆనందం అందిస్తుందన్నారు.


ఫులౌరా:
ఫూలోరి అని కూడా పిలవబడే ఫులౌరా ఒక సంతోషకరమైన అనుభూతి అందిస్తుందన్నారు. ఫులౌరాలను చట్నీలతో వేడిగా వడ్డిస్తారన్నారు.
మసాలా చాయ్ :
మసాలా చాయ్ అమృతాన్ని ప్రస్తావించకుండా తెలంగాణలో ఏ వర్షాకాల వంట ప్రయాణం పూర్తి కాదు. బ్లాక్ టీ ఆకులు, ఏలకులు, అల్లం, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు, పాలు, పంచదారతో కలిపి సృష్టించే ఈ మసాలా చాయ్ అసమానమైన ఆనందాన్ని అందిస్తుందన్నారు.

తెలంగాణలో వర్షాకాలంలో వైవిధ్యమైన, నోరూరించే ఆహారాలను అన్వేషిస్తున్నప్పుడు, ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ సీజన్ ఆహారం పరంగా పండుగ సమయమ‌న్నారు. కరకరలాడే ఫ్రై ల నుండి మనస్ఫూర్తిగా ఆస్వాదించే పానీయాల వరకు, ఆహ్లాదకరమైన ట్రీట్‌లను ఆస్వాదించడంలోని ఆనందాన్ని గుర్తుచేస్తుందన్నారు. స్వాద్ జో జిందగీ సే జడ్ జాయే అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement