Friday, November 22, 2024

HYD: మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌కు ప్రోత్సాహం.. ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్ర‌భుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంద‌ని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. తరంగిణి కల్చరల్ అకాడమీ చైర్ పర్సన్ పద్మజ అధ్వర్యంలో జరిగిన పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, హైదరాబాద్ లోని మాదాపూర్ లోని శిల్పారామంలో సావిత్రి బాయి పూలే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజ‌రై మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన చిన్నారులకు ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా షీల్డ్స్ ప్రధానం చేయడం జరిగింది. అనంతరం ఉప్పల శ్రీనివాస్ గుప్తాను ఘనంగా సన్మానించి షీల్డ్ బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. గత తొమ్మి దిన్నర సంవత్సరాలుగా సంక్షేమం లో దేశంలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. ఆడ బిడ్డలను గౌరవించే సంస్కృతి మన తెలంగాణదేన‌న్నారు. మహిళల భద్రత కోసం షి టీమ్ ఏర్పాటు చేశామ‌ని, ఆడబిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మీ పథకం ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామ‌ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమాజ సేవకులంద‌రికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన టీం సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో మాధవి బెల్లం తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా విభాగం చైర్‌పర్సన్, నిర్మల ఇంటర్నేషనల్ ఈవెంట్‌ల చైర్‌పర్సన్ మేరీ, లక్ష్మీ దుర్గా జీవ నధి ఫౌండేషన్, నటీనటులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement