Monday, November 18, 2024

Encounter – అవును నేను గులా‌మ్‌నే.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి ఘాటు జవాబు

హామీలు ప్ర‌శ్నిస్తే.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు
కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో భ్ర‌ష్టుప‌ట్టిన‌ రాజ‌కీయాలు
ఏడాది కావస్తున్నా హామీల అమ‌లు శూన్యం
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాల‌న‌కు ఏమీ తేడా లేదు
గ‌ట్టిగా ప్ర‌శ్న‌స్తే వ్య‌క్తిత్వ హ‌ననం చేస్తున్న పార్టీల‌వి
బీజేపీ బూత్ క‌మిటీ సమావేశంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

ఆంధ్రప్ర‌భ స్మార్ట్‌, హైదరాబాద్‌:
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు పెద్ద తేడా ఏమీలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్‌ నేతల గాలి మాటలతో ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. హైద‌రాబాద్‌లో సోమ‌వారం జ‌రిగిన బూత్ క‌మిటీల స‌మావేశంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడారు.

వారివ‌న్నీ గాలి మాట‌లే..

కాంగ్రెస్ లీడ‌ర్ల గాలి మాటలతో ప్రజలు విసిగిపోయార‌ని కిష‌న్‌రెడ్డి అన్నారు. వ్యక్తులను విమర్శించడమే రాజకీయం అనుకుంటున్నార‌ని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయ‌ని ఫైర్ అయ్యారు. రెండు పార్టీల‌ నేతల మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయని.. బాధ్యతారహితంగా ఇరు పార్టీల నేతలు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేస్తున్నార‌ని కేంద్ర‌మంత్రి వ్యాఖ్యానించారు. అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింద‌ని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా అబద్దపు ప్రచారం చేస్తున్నార‌న్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని కిష‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు.

ఇట‌లీకి వారు గులాంలు..

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటలీకి గులాంల‌ని.. తాను ఎవరికీ గులాం కాద‌ని కిష‌న్‌రెడ్డి అన్నారు. భారతీయులకు మాత్రమే తాము గులాముల‌న్నారు.. వ్యక్తిగతంగా బురదచల్లే ప్రయత్నం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు చేస్తున్నాయని మండి ప‌డ్డారు. తాత్కాలికంగా ప్రజలు వారికి జై కొట్టవచ్చు కానీ ఎక్కువసార్లు ప్రజలను ఎవరు మోసం చేయలేరన్నారు. నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేసే వారికే ప్రజలు అండగా ఉంటారని చెప్పారు. తెలంగాణలో ఉన్నంత దిగజారుడు రాజకీయాలు మరే రాష్ట్రంలో లేవన్నారు. మూడు వందల రోజులు పూర్తయినా.. హామీల అమలు చేయగలరా? అని ప్రశ్నించారు. అలాగే, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని కామెంట్స్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేద‌ని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పాలన సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు మధ్య తేడా ఏమీ లేదని కిష‌న్‌రెడ్డి కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement