Friday, November 1, 2024

మంత్రి ‘ప్రశాంత్ రెడ్డి’ని కలిసిన ‘రవీందర్’ రెడ్డి..

హైద‌రాబాద్ : ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని రంగాలను సంతృప్తి పరిచిందని టీఎన్జీవో కేంద్ర సంఘం పూర్వ అధ్య‌క్షుడు కారం రవీంద‌ర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర బ‌డ్జెట్ తెలంగాణ ప్ర‌జ‌ల‌, ఉద్యోగుల ఆశ‌ల‌ను నిజం చేసేలా ఉంద‌ని శాస‌నమండ‌లిలో రెండోసారి వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డిని ఆయ‌న నివాసంలో క‌లిసి కారం ర‌వీంద‌ర్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. కరోనా కష్టకాలంను తట్టుకొని నిలబడి రూ. 2,30,826 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని మరొకసారి సీఎం కేసీఆర్ ఆవిష్కరించార‌న్నారు. ప్రజా సంక్షేమం ఎక్కడా కుంటుపడకుండా చూడట‌మే కాకుండా తెలంగాణ ప్రజలను కరోనా భారి నుండి కాపాడుకోవడం గొప్ప విషయమ‌న్నారు.  విద్యారంగాన్ని, ఆర్టీసీని కాపాడుకోవడానికి రూ.3 వేల కోట్ల చొప్పున కేటాయించడం ద్వారా ఆయా రంగాల అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు. భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఉద్యోగుల వేతన సవరణకు అడ్డంకులు తొలగి, లాభదాయకమైన వేతనాల సవరణ చేస్తామ‌న్న సీఎం ప్రకటనకు బలాన్ని చేకూర్చిందన్నారు. భారీ సంక్షేమ బడ్జెట్‌ను ప్రతిపాదించిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్న‌ట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement