Friday, November 22, 2024

HYD: బిల్డింగ్ పై నుంచి దూకి వృద్ధురాలి ఆత్మహత్య…

నాగోల్, జూన్ 3(ప్రభ న్యూస్) : అర్థరాత్రి నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలు రెండంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. నాగోల్ సీఐ పరుశురాం కథనం ప్రకారం… నాగోల్ హిందు అరణ్యా పల్లవి అపార్ట్ మెంట్స్ లో యం.నాగమని(71) కొడుకు లక్ష్మి నరసింహతో ఉంటుంది. ఈ క్రమంలో గత నాలుగు సంవత్సరాల నుంచి నాగమణి అనారోగ్యంతో బాధపడుతున్నారని, దీంతో ఆమె మానసికంగా కృంగి పోయి ఉన్నారని పేర్కొన్నారు.

దీంతో ఈ అర్థరాత్రి అపార్ట్ మెంట్ రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని, డయల్ 100 ద్వారా విషయం తెలియగానే నాగోల్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను సుప్రజా హాస్పిటల్ కి తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement