దావోస్ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన వలసిందిగా కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్, టిటిడి మాజీ జెఈవో , EICBI వైస్ చైర్మన్. విశ్రాంత ఐఎఎస్ బి లక్ష్మీకాంతంకు ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందింది.. ఈ సమావేశం జనవరి 15వ తేదిన స్విట్జర్లాండ్ వేదికగా జరగనుంది.. ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి నిష్టాతులైన ఆర్ధిక వేత్తలు, వివిద రంగాలలో నిపుణులైన మేధావులు, అధికారులు పాల్గొననున్నారు..
కాగా, ప్రపంచం ఎకనామిక్ ఫోరమ్ ప్రతి సంవత్సరం గ్లోబల్ , రీజినల్ , ఇండస్ట్రియల్ ఎజెండాలను రూపొందిస్తున్నది.. వివిధ రంగాలలో పోటీతత్వం, లింగ సమానత్వం, ప్రపంచ సమాచార సాంకేతికతలపై అత్యాధునిక డేటాను ఉత్పత్తి చేసే ప్రపంచ స్థాయి పరిశోధన సామర్థ్యాలను వరల్డ్ ఎకనామి ఫోరమ్ ఎంకరేజ్ చేస్తున్నది.. ఈ ఏడాది ఫోరమ్ లో ” COOPERATION IN A FRAGMENTED WORLD ధీమ్ తో సదస్సులు, డిబెట్ లు, వర్క్ షాపులు నిర్వహిస్తున్నది.. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం లభించడం పట్ల లక్ష్మీకాంతం హర్షం వ్యక్తం చేశారు..