హైదరాబాద్, ఆంధ్రప్రభ : కోవిడ్ సెకండ్‌వేవ్ మృత్యు ఘంటికల మోగిస్తున్న ఈతరుణంలో ప్రయివేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షల్లో ఫీజులు అక్రమంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. సంపాదించుకునేందుకు ఇది సమయం కాదు అని ప్రయివేటు/కార్పోరేటు ఆసుపత్రులకు హితవు చెప్పారు. నిబంధనల మేరకే ప్రయివేటు ఆసుపత్రులు ఫీజులు వసూలు చేయాలని తేల్చి చెప్పారు. సాధారణ పడకలకు రోజుకు రూ.4వేలు, ఐసీయూ పడకలకు రోజుకు రూ.7500, వెంటిలేటర్ ఉన్న ఐసీయూ బెడ్‌కు రూ.9వేలు తీసుకోవాలన్నారు. కొన్ని ప్రయి వేటు ఆసుపత్రులు బిల్లు కట్టకపోతే కోవిడ్ మృతుల శవాలను బంధువులకు అప్పగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ చికిత్సలను వ్యాపార కో ణంలో చూసే ఆసుపత్రులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం బీఆర్‌కే భవన్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్సిజ న్ కొరత లేదన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుం టున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నామన్నారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్‌ను రాష్ట్రానికి తెప్పించామని గుర్తు చేశారు. 4లక్షల రెమిడిసివిర్ ఇంజక్షన్లకు గతంలోనే ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. ఆక్సిజన్ వినియోగంపై పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారుల కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పీఎం కేర్ నుంచి 5 ఆక్సిజన్ మిషన్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోందని వివరించారు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే… ఆక్సిజన్ కొరతతో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పా రు. రాబోయే కాలంలో కరోనా బాధితుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా ఆక్సిజన్ సరఫరా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10వేల ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసు పత్రిలో 600 ఐసీయూ పడకలు ఉన్నాయని వివరించారు. దేశంలోనే ఇన్ని ఐసీయూ పడకలను నిర్వహిస్తున్న ఏకైక ఆసు పత్రి గాంధీ ఒక్కటేనని చెప్పారు. గాంధీలో మరో 400 పడకలకు ఆక్సిజన్ లైన్స్ వేయాలని నిర్ణయించినట్లు ప్రకటిం చారు. గచ్చిబౌలి టిమ్స్‌లో 300, వరంగల్ ఎంజీఎంలో 300, నిమ్స్ లో 200, ఎంసీహెచ్ సూర్యాపేటలో 200, నల్గొం డ ప్రభుత్వ ఆసుపత్రిలో 200… ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3వేల ఆక్సిజన్ పడకలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వారంలోగా 3వేల ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వైద్యులు, శానిటరీ స్టాఫ్, నర్సులను నియమిస్తున్నామని వివరించారు.
నేటి నుంచి నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కోవిడ్ సేవలు మొదలవుతాయన్నారు. ఆక్సిజన్‌తో కూడిన 350 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇటు నిమ్స్ లో సాధారణ రోగులకు చికిత్స అందించే బ్లాక్‌ను పూర్తిగా కోవిడ్ బాధితులకు కేటాయించి… మొత్తంగా 200 బెడ్లు నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్ కొనుక్కుని వేయించుకోవాలన్న నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలను కరోనా నుంచి కాపాడేం దుకు వ్యాక్సిన్‌ను కేంద్రం సరఫరాచేయాలన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు కేంద్రానికి ఒక రేటుకు, రాష్ట్రాలకు ఒక రేటుకు వ్యాక్సిన్ ను విక్రయించాలని ఏ న్యాయ శాస్త్రంలో ఉందో చెప్పాలన్నారు. ఇది అత్యంత బాధాకరమైన విష యమని, ఎవరూ అంగీకరించని అన్నారు.
శవాలపై వ్యాపారం చేయకండి – ప్రైవేటు హాస్పటల్స్ కు ఈటల ఘాటు హెచ్చరిక..
Advertisement
తాజా వార్తలు
Advertisement