హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ను అందజేయాలని కోరారు.. హైదరాబాద్ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 45 ఏళ్ల పై బడిన వారికి మాత్రమే ఉచితంగా ఇస్తామనడంలో ఔచిత్యం లేదని అన్నారు… తెలంగాణలో 18 ఏళ్ల పై బడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు 3.3 కోట్ల డోసులు కావాలని, అయితే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థల సామార్ధ్యం ఆరు కోట్ల డోసులేనని అన్నారు..ఈ పరిస్థితులలో యుద్ద ప్రాతిపదికన వ్యాక్సిన్ ఉత్పత్తికి చర్యలు కేంద్రం తీసుకోవాలని కోరారు.. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలి అని ఈటల డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో రాష్ర్టాలను తప్పుబడుతున్న కేంద్రం ఏం చేసింది? అని ప్రశ్నించారు. 3.5 కోట్ల టీకాలు 3 నెలల్లో ఇవ్వాలని అనుకుంటున్నామని, అలాగే వ్యాక్సిన్ దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు.. ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాలపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించి మాట్లాడితే బాగుంటుందని చురకలంటించారు… తెలంగాణలో 4 రాష్ర్టాలకు చెందిన రోగులకు చి కిత్స అందిస్తున్నామని తెలిపారు. తాము కేంద్రాన్ని విమర్శించట్లేదని,అయితే వారే తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కరోనా కట్టడిలో దేశంలోనే సమర్థంగా వ్యవహరిస్తున్న రాష్ర్టం తెలంగాణ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం మన దేశం సాయం చేసే స్థితి నుంచి చిన్న దేశాల సాయం పొందే పరిస్థితి లోకి వచ్చిందని ఈటల రాజేందర్ అన్నారు. ఆక్సిజెన్ కొరతపై మాట్లాడుతూ,కరోనా రోగులు సరిపడా ఆక్సిజన్ లేక చనిపోవడం దేశానికి అవమానకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలతో ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. అవసరమైన ఆక్సిజన్‌ను కేంద్రం యుద్ధ ప్రతిపాదికన సరఫరా చేయాలన్నారు. తెలంగాణకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని కోరామని, కానీ రాష్ర్టానికి 306 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే కేటాయించిందన్నారు. రాష్ర్టానికి దగ్గర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ఇవ్వాలని కోరినప్పటికీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ర్టాల నుంచి ఆక్సిజన్ ను కేటాయించారన్నారు.. అయినప్పటికీ యుద్ద విమానాల ద్వారా దూర ప్రాంతాల నుంచి అక్సిజెన్ ను తెప్పించుకుంటున్నామని అన్నారు..
కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి – ఈటల డిమాండ్
By sree nivas
- Tags
- CENTRAL GOVERNMENT
- Eatala
- FREE VACCINE
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
- vaccination
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement