Sunday, November 17, 2024

చెత్తవేస్తే 5 వేలు జరిమానా..

కవాడి గూడ : ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని గాంధీనగర్‌ డివిజన్‌ కార్పోరేటర్‌ ఏ పావని వినయ్‌కుమార్‌ సూచించారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయరాదని, ఒకవేళ వేస్తే జిహెచ్‌ఎంసి అధికారులు 5 వేల రూపాయల జరిమానా విధిస్తారని ఆమె చెప్పారు. బిన్‌ ఫ్రీ సిటీ కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లోని ఆంధ్రాకేఫ్‌ వద్ద చెత్తకుండిని తొలగించి..బ్లీచింగ్ పౌడర్‌ చల్లి.. 5 వేల రూపాయల జరిమానాతో కూడిన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి అని, ఇందులో ప్రజలను భాగస్వాములను చేసి అవగాహాన కల్పించాలని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు ఎక్కడా రాజీపడవద్దని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని తెలిపారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయరాదని ఆమె సూచించారు. దోమల నివారణ చేపట్టకపోతే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాదుల భారిన పడే ప్రమాదం ఉందని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో చెత్త రహిత నగరంగా గ్రేటర్‌ను తీర్చిదిద్దాలని కార్పోరేటర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement