Tuesday, November 26, 2024

ప్రతి బస్తీలో ఇంటింటికి శానిటైజేషన్‌..

నల్లకుంట : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్‌ నాయకుడు దూసరి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. కరోనాను ఎదుర్కోవడానికి గోల్నాక డివిజన్‌లోని ప్రతి బస్తీలో ఇంటింటికి శానిటైజేషన్‌ చేయిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. డివిజన్‌లోని నింబోలిఅడ్డ ఎస్సీ హాస్టల్‌ లేన్‌, ఖాద్రీబాగ్‌, శంకర్‌నగర్‌లో ప్రతి ఇంటికి శానిటైజేషన్‌ చేయించారు. ప్రభుత్వం ఎంత చేసినా ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించాలని, అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని, బౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనాను తరిమికొట్టడానికి అందరు ఏకం కావాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నర్సింగ్‌ యాదవ్‌, ఆర్‌. కె. బాబు, పల్లవి, లక్ష్మణ్‌గౌడ్‌, అనిల్‌యాదవ్‌, శంకర్‌నగర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement