(ప్రభన్యూస్‌బ్యూరో,ఉమ్మడిరంగారెడ్డి ) : పత్తి సాగుకు కూలీల కొరత ఉన్నప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. కూలీలు ఎక్కడ దొరుకుతారో అక్కడికి వెళ్లి వారిని తీసుకవచ్చి పత్తి పనులు చేయించుకుంటున్నారు… మద్దతు ధర కూడా లభిస్తుండటంతో మెజార్టీ రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే పత్తికి ఆశించినమేర ధర లభిస్తోంది. వరి
పంట సాగు చేయాలంటే కర్చుతో కూడుకున్నది కావడంతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. పశు సంపద తగ్గిపోయింది. ట్రాక్టర్ల ద్వారా వరి నాట్లు వేసేందుకు భూములు సిద్ధం చేయాల్సి ఉంటుంది. పెరిగిన పెట్రో ధరల నేపథ్యంలో ట్రాక్టర్లతో దున్నించడం భారంగా మారింది. దాంతోపాటు నాట్లు వేసేందుకు కూలీల కొరత అన్నింటిని అదిగమించి సాగు చేస్తే కోతల సమయంలో మిషన్లతో కోతలు కోయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
వీటన్నింటిని లెక్కిస్తే వరి సాగు చేస్తే లాభం పక్కన పెడితే నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితులు. వీటన్నింటిని బేరీజు వేసుకున్న రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పత్తి సాగు చేయాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ధాన్యం కొంటారా లేదా అనే పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగును చాలావరకు తగ్గించారు. పత్తి సాగు చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో మెజార్టీ రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.